అధిక రక్తపోటు నియంత్రణకు వాడే మందులు దృష్టి సంబంధమైన వ్యాధులకు దారితీస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. చూపును దెబ్బతీసే ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజెనరేషన్ (ఏఎండీ)కి, బీపీ నియంత్రించే మాత్రలకు మధ్య సంబంధం ఉందని పాత అధ్యయనాలు కూడా చెపుతున్నాయని పరిశోధకులు అంటున్నారు. వయసు పైబడ్డం వల్ల వచ్చే ఈ వ్యాధికి ఇతర కారణాలు కూడా దోహదపడతాయంటున్నారు. వంశపారంపర్యం, పొగతాగే అలవాటు వీటిలో ముఖ్యమైనవని వారు చెప్తున్నారు. ఏఎండీకి, రక్తపోటును నియ్రంత్రించే మాత్రల వాడకానికి మధ్య సంబంధాన్ని కనుగొనేందుకు విస్కాన్సిన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ఓ పరీక్షను నిర్వహించారు. ఇందులో 5 వేల మంది రోగులను నిర్ణీత సమయం ప్రకారం పరీక్షిస్తూ వచ్చారు. వీటికి దూరంగా ఉండేవారికి ఈ ముప్పు నామ మాత్రంగా ఉందని చెప్పారు. ఈ ఫలితాలను నిర్థారించే దిశగా మరిన్ని పరిశోధనలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన రొనాల్డ్ క్లెయిన్ అన్నారు. అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఆప్తమాలజీ జర్నల్ ఈ పరిశోధనను ప్రచురించింది.
ఆ మాత్రలతో దృష్టిలోపం?

0 comments:
Post a Comment