కొత్త ఏడాదిలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం సాధారణంగా చేసేదే. అయితే ఈ ఏడాది ఆ నిర్ణయాల్లో హెల్తీ ఫుడ్‌ని కూడా చేర్చండి. ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా యువత నుంచి వయసు పైబడిన వారి వరకు అందరినీ అధిక రక్తపోటు సమస్య వేధిస్తోంది. అందుకే మీ డైట్‌లో ఈ జ్యూస్‌లు చేర్చండి. బీపీని నియంత్రించడంలో ఈ జ్యూస్‌లు బాగా ఉపకరిస్తాయి.
లో-ఫ్యాట్ మిల్క్:హైబీపీతో బాధపడుతున్నారా? అయితే రోజూమూడు గ్లాసుల లో-ఫ్యాట్ మిల్క్‌ను తీసుకోండి. ఎందుకంటే అధికరక్తపోటుకు కాల్షియంకు సంబంధం ఉందని అధ్యయనంలో తేలింది. కాల్షియం లోపంతో బాధపడే వారిలో అధిక రక్తపోటు కనిపిస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు లో-ఫ్యాట్ మిల్క్ తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. హోల్ మిల్క్‌తో పోల్చితే లో-ఫ్యాట్ మిల్క్‌లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా లో-ఫ్యాట్‌లో కచ్చితమైన శాతంలో ఉండే ప్యాట్ కాల్షియంను అబ్జార్బ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
దానిమ్మ జ్యూస్ : అధికరక్తపోటుపై యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్స్ ప్రభావం ఉంటుంది. ఏసీఈ ప్రభావం ఎక్కువ ఉంటే రక్తనాళాలపై ఎక్కువ ఒత్తిడి పడి రక్తపోటు పెరుగుతుంది. అయితే దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల ఆ ఎంజైమ్స్ విడదల నిరోధింపబడుడుతుంది. దానిమ్మజ్యూ్‌సలో సహజసిద్ధమైన ఏసీఈ ఇన్హిబిటర్స్ ఉంటాయి. దానిమ్మజ్యూస్ తీసుకోవడం వల్ల సిస్టోలిక్ బ్లడ్‌ప్రెషర్ 30 శాతం మేర తగ్గుతుంది.
బీట్‌రూట్ జ్యూస్: రక్తపోటును తగ్గించడంలో ఈ జ్యూస్ బాగా పనిచేస్తుంది. రోజూ ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్ తగ్గినా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బీట్‌రూట్‌లో సహజసిద్ధంగా లభించే నైట్రేట్ ఉంటుంది. శరీరం ఈ నైట్రేట్‌ను నైట్రిక్‌ఆక్సైడ్‌గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఇది రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది.
హైబిస్కస్ టీ : ఇందులో ఆరోగ్యగుణాలు ఎక్కువే ఉంటాయి. మందార పూలలో సహజసిద్ధమైన ఏసీఈ ఇన్హిబిటర్స్ ఉంటాయి. రోజూ ఒకసారి హైబిస్కస్ టీ తీసుకుంటే ఒక పాయింట్ రక్తపోటు తగ్గుతుంది. రోజూ మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.
కాన్‌బెర్రీ జ్యూస్: రక్తనాళాల డ్యామేజ్‌ను అరికట్టడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాల్లో రక్తసరఫరాను పెంచడంలో సహాయపడతాయి. రోజూ రెండు కప్పుల కాన్‌బెర్రీజ్యూస్ తీసుకుంటే రక్తపోటు రిస్క్ దరిచేరకుండా ఉంటుంది.

0 comments:
Post a Comment