Powered by Blogger.

మానవాళికి రక్త పోటు


పెరుగుతున్న సిస్టోలిక్‌ బీపీ.. హృద్రోగాలు, కిడ్నీ వ్యాధులకు మూలం
ప్రపంచవ్యాప్తంగా కోటి మంది మృతి.. 2015 గణాంకాలలో వెల్లడి.. సర్వే
 ప్రపంచవ్యాప్తంగా రక్తపోటు బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.. ప్రధానంగా సిస్టోలిక్‌ బ్లడ్‌ ప్రెజర్‌(ఎ్‌సబీపీ) రోజురోజుకూ పెరుగుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీనివల్ల గుండె జబ్బులు, పక్షవాతం తదితర వ్యాధుల ముప్పు ప్రమాదకరంగా విస్తరిస్తోందని ఈ అధ్యయనం హెచ్చరించింది. ఈమేరకు 1990లతో పోలిస్తే 2015 నాటికి ఈ జబ్బు బాధితులు పెరిగారని తేల్చింది. 2015లో దాదాపు 350 కోట్ల మంది ఎస్‌బీపీ స్థాయులు 110 నుంచి 115 మిల్లీమీటర్‌ ఆఫ్‌ మెర్కురీ(ఎంఎంహెచ్‌జీ) మధ్యలో ఉండేవని, మరో 87.4 కోట్ల మందిలో ఇది 140 ఎంఎంహెచ్‌జీ ఆపైన ఉండేదని వాషింగ్టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఎస్‌బీపీ స్థాయులు పెరిగితే హృద్రోగాలతో పాటు కిడ్నీ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. దీంతోపాటు అకాల మరణం, వైకల్యానికి కారణమవుతోందని తెలిపారు. ఈమేరకు 155 దేశాల్లోని 844 పరిశోధనా పత్రాలను నిశితంగా పరిశీలించి ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు తెలిపారు. ఇక ఎస్‌బీపీ శాతం విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతోందని అన్నారు. దీంతో డిజేబులిటి అడ్జస్టెడ్‌ ఇయర్స్‌(డీఏఎల్‌వై), అకాల మరణాలకు ఆస్కారం ఉందని వివరించారు. ఎస్‌బీపీలో ఓ మోస్తరు పెరగడంవల్ల 2015లో ప్రపంచవ్యాప్తంగా ఒక కోటి మంది మరణించగా.. 21.2 కోట్ల మంది డీఏఎల్‌వైతో బాధపడుతున్నారని చెప్పారు. ఎస్‌బీపీ పెరగడం, తద్వారా వచ్చే పరిణామాలతో మరణిస్తున్నవారిలో ఇచెమిక్‌ హార్ట్‌ డిసీజ్‌ బాధితులే ఎక్కువ. ఈ సంఖ్య 49 లక్షలుగా ఉంది. హెమరాజిక్‌ సో్ట్రక్‌తో 20 లక్షలు, ఇచెమిక్‌ సో్ట్రక్‌తో 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఇక సుదీర్ఘ కాలం అనారోగ్యాలకు గురవుతున్న వారి విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాధితులలో సగం మంది కేవలం ఐదు దేశాల(చైనా, ఇండియా, రష్యా, ఇండోనేషియా, అమెరికా)లోనే ఉన్నారని చెప్పారు.
Share on Google Plus

About Kiran

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

0 comments:

Post a Comment

Healthy