Powered by Blogger.

రెండు గ్లాసుల బీరు.. గుండెకు మేలు!


మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. టీవీల్లో, సినిమాహాల్లో మనకు తరచు వినిపించే.. కనిపించే నినాదాలు. కానీ, రోజూ రెండు గ్లాసుల బీరు అంటే సుమారు 290 మిల్లీలీటర్ల బీరు మన గుండెకు మంచిదని కొత్త అధ్యయనం చెబుతోంది! హార్వర్డ్‌ మెడికల్‌ యూనివర్సిటీ పరిశోధకులు 15 వేల మంది మందుబాబులపై (మహిళలు కూడా) అధ్యయనం చేశారు. వారానికి ఏడు డ్రింకులు, 7-14, 14-21, 21పైన డ్రింకులు చేసే 45-64 ఏళ్ల వయసున్న వారిపై అధ్యయనం చేశారు. అయితే యుక్త వయసు నుంచి నడివయసు వారి వరకు ఏడు డ్రింకుల తీసుకునే వారిలో గుండె జబ్బుల ప్రమాదం 20 శాతం తక్కువని తేలింది. అదే ఎక్కువ డ్రింకులు తీసుకున్న వారిలో 1,271 మంది పురుషులు, 1237 మహిళలు గుండె జబ్బుల బారిన పడ్డారని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే రోజు రెండు గ్లాసుల బీరు తీసుకుంటే గుండెకు ముప్పు తక్కువని చెబుతున్నారు. 
Share on Google Plus

About Kiran

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

0 comments:

Post a Comment

Healthy