స్త్రీలలో వచ్చే కేన్సర్లలో ఐదవ స్థానం అండాశయ కేన్సర్‌దే. ఇతరుల కేన్సర్లకన్నా ఎక్కువ మంది స్త్రీలను మృత్యువాతకు గురిచేసేది కూడా ఇదే. వయసు పెరిగే కొద్దీ ఈ కేన్సర్ బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా 70 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అంతకు ముందే రొమ్ము కేన్సర్ ఉన్నా లేదా కుటుంబ పూర్వీకుల్లో ఎవరికైనా రొమ్ము కేన్సర్ ఉన్నా అండాశయ కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ కేన్సర్ ముందే గుర్తించగలిగితే ఈ వ్యాధి నుంచి విముక్తమయ్యే అవకాశాలు ఎక్కువే. ప్రాఽథమిక దశలోనే ఈ కేన్సర్‌ను గుర్తించడం చాలా మందికి సాధ్యం కాకపోవచ్చు. దానికి కారణం, అండాశయ కేన్సర్ లక్షణాల గురించిన అవగాహన చాలా మందిలో లేకపోవడమే కారణం.
పక్కదారి పట్టించే లక్షణాలు
అండాశయ కేన్సర్ లక్షణాలు చాలా వరకు వేరే వ్యాధి లక్షణాలను పోలి ఉంటాయి. అందుకే చాలా మంది జీర్ణాశయ, మూత్రాశయ వ్యాఽధులుగా పొరబడే ప్రమాదం ఉంది. అయితే వేరే వ్యాధి లక్షణాలుగా అనిపించినా అవి ఎక్కువ కాలం కొనసాగుతూ, ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తూ వెళుతున్నప్పుడు ఇక అనుమానించక తప్పదు. ఇతర వ్యాఽధులుగా భ్రమింపచేసే లక్షణాలు కొన్ని..
పొట్ట లేదా కటి భాగంలో ఒత్తిడిగా గానీ, అసౌకర్యంగా గానీ, నొప్పిగా గానీ ఉండడం.
దీర్ఘకాలికంగా అజీర్తిగా ఉండడం, కడుపు ఉబ్బరం, వికారంగా ఉండడం.
ఏం కొంచెం ఆహారం తీసుకున్నా కడుపు నిండి నట్టు అనిపించడం.
పేగుల కదలికల్లో సమస్య ఇదీ అని చెప్పలేని మార్పులేవో చోటుచేసుకోవడం. ఫలితంగా తరుచూ విరేచనాలు కావడం లేదా మలబద్దకంగా ఉండడం.
పొట్ట భాగంలో వాపు రావడం లేదా కడుపు ఉబ్బరంగా ఉండడం.
మూత్రాశయంలో కొన్ని మార్పులొచ్చి దీనివల్ల తరుచూ మూత్రం రావడం లేదా, మూత్రాన్ని కొన్ని క్షణాలైన ఆపలేక వెంటనే విసర్జనకు పరుగెత్తాల్సి రావడం.
ఆకలి తగ్గిపోవడం. ఏ కారణమూ తెలియకుండానే బరువు తగ్గిపోవడం లేదా హఠాత్తుగా పెరిగిపోవడం.
రతిలో పాల్గొంటే నొప్పి అనిపించడం.
సాధారణ లక్షణాలకు భిన్నంగా, రోజురోజుకూ బరువు తగ్గిపోవడం లేదా పెరిగిపోవడం. పొట్ట భాగం పెరిగిపోవడం వెన్నునొప్పి రావడం.
ఈ లక్షణాలు రెండు మూడు వారాలకు మించి కొని సాగుతుంటే, వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం చాలా అవసరం.

0 comments:
Post a Comment