స్టీమ్‌బాత్ ఆరోగ్యంతో పాటు అందానికీ చాలా మంచిది. స్టీమ్‌బాత్ వల్ల శరీరం రిలాక్స్ కావటంతో పాటు యూత్‌ఫుల్‌నెస్ ఫీలింగ్ కలుగుతుంది. దీంతో పాటు సైనస్ శుభ్రంగా ఉంటుంది. ఇంతకీ ఆవిరిపట్టడం వల్ల ముఖ్య ఉపయోగాలేంటో తెల్సుకుందాం.
స్టీమ్‌థెరఫీ గ్రీకుల కాలం నుంచే ఉంది. ఆరోగ్యమైన శరీరం కోసం గ్రీకులు స్టీమ్‌బాత్‌ను ఆశ్రయించేవారట. మన దేశంలో ఆవిరిపట్టుకోవడం అనే ప్రక్రియ చాలా సహజమైనది.
ఆవిరిపట్టుకోవడం వల్ల అందమైన ఆరోగ్యం సొంతమవుతుంది. ఒత్తిడి, డిప్రెషన్ వదిలిపోతాయి.
విరిపట్టుకోవడం వల్ల శరీరం రిలాక్సేషన్ స్థితికి వస్తుంది. దీంతో పాటు సుఖనిద్ర కలుగుతుంది.
ఇమ్యూన్ సిస్టమ్ స్టీమ్‌బాత్ వల్ల బలపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది.
జలుబు, దగ్గు, అలర్జీలు, శ్లేష్మ సంబంధ సమస్యలు స్టీమ్‌బాత్‌తో వదిలిపోతాయి.
శరీరానికి హాని కలిగించే టాక్సిన్స్ పోతాయి.
స్టీమ్‌బాత్ వల్ల శ్వాసప్రక్రియ మెరుగవుతుంది.
చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. చర్మంపై నొప్పితో కూడిన వాపు త్వరగా తగ్గిపోతుంది.
స్టీమ్‌బాత్ వల్ల బరువు తగ్గుతారని పరిశోధకులు అంటున్నారు.
శరీరంలోని నొప్పులు తొలగిపోతాయి.

0 comments:
Post a Comment