ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటే భయమేస్తోంది. ఎండవేడిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఎండ వేడి వల్ల శారీరకంగా రకరకాల సమస్యల బారిన పడుతున్నాం. ఆ బాధలేమిటో..
వాటిని ఎలా అధిగమించవచ్చో తెలుసుకుందామా...
ఎండలో బాగా తిరగడం వల్ల హీట్ ఎగ్జాషన్ వచ్చి శరీరంలోని నీటిశాతం బాగా తగ్గిపోతుంది. దీంతో బాగా బలహీనపడతాం. బ్లడ్‌ప్రషర్ పడిపోతుంది. తలనొప్పి, తల తిరుగుతున్నట్టు ఉంటుంది. ఇలాంటప్పుడు చల్లటి ప్రదేశంలో కెళ్లి కూర్చుంటే మంచిది. నీళ్లు బాగా తాగాలి. వేసవిలో వచ్చే మరో సమస్య హీట్ క్రాంప్స్. ఫిజికల్‌గా బాగా శ్రమపడ్డా, శరీరంలో ఎలక్ర్టోలైట్ సమతుల్యత లోపించినా హీట్ క్రాంప్స్ వస్తాయి. దీంతో బాధపడేవారు మంచినీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మకాయనీళ్లు వంటివి బాగా తాగాలి.
ఎండ వేడిమి నుంచి రక్షణ...
రోజుకు 3-4 లీటర్ల ఫ్లూయిడ్స్‌ను తాగాలి.
నాన్ కేఫినేటెడ్, నాన్ ఆల్కహాలిక్ డ్రింకులను మాత్రమే తాగాలి. ఆల్కహాల్, కేఫినేటెడ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తే అవకాశం ఉంది.
విపరీతంగా చల్లగా ఉన్న ద్రవపదార్థాలను తీసుకోకూడదు. అలా చేస్తే స్టొమక్ క్రాంప్స్ వచ్చే అవ కాశం ఉంది.
దాహంగా లేకపోయినా నీళ్లు తాగుతుండాలి.
బయటకు వెళ్లినప్పుడు గంటకొకసారి గ్లాసుడు మంచినీళ్లు లేదా జ్యూస్ తాగుతుండాలి.
నీరు ఎక్కువగా ఉన్న పుచ్చకాయ, కీర, పైనాపిల్‌లాంటి ముక్కల్ని కలిపి తినాలి.
చెమటను పీల్చే ఉన్ని దుస్తులు వేసుకోవాలి. దుస్తులు బిగుతుగా ఉండకుండా లూజుగా ఉంటే మంచిది.
బయటకెళ్లేటప్పుడు తలపై టోపి పెట్టుకోవాలి. లేదా తడిపిన కర్ఛీ్‌ఫని తలకు చుట్టుకోవాలి. అలాకాకపోతే బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గొడుగు వేసుకోవాలి.

0 comments:
Post a Comment