వయసు పైబడిన వారిలో ఎముకలలో అరుగుదల మొదలవుతుంది. కొందరిలోనైతే అనేక కారణాల వల్ల చిన్న వయసులోనే ఎముకల్లో అరుగుదల వస్తుంది. ఈ వ్యాధినే ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అంటారు. కీళ్ల అరుగుదల వల్ల రోజూ చేసే పనులకు ఎంత ఆటంకం కలుగుతుందో ఒక్కమాటలో చెప్పలేం. అయితే ఆ బాధ నుంచి విముక్తి పొందవచ్చు అంటున్నారు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ మురళీ అంకిరెడ్డి.
కీళ్లలో కదలికలు తగ్గడం, నొప్పి, పట్టేసినట్టు ఉండటం, వాపు రావడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అది కచ్చితంగా ఆస్టియో ఆర్థరైటిస్‌గానే భావించాలి. అధిక బరువు, వ్యాయామం చేయకపోవడం వంటి పనుల వల్ల కీళ్లలో త్వరగా అరుగుదల వస్తుంది. అయితే పురుషులకన్నా మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువగా చూస్తుంటాం. 40 సంవత్సరాలు దాటిన మహిళల్లో ఎక్కువమంది ఈ వ్యాధి బారిన పడుతుంటారు.
మోతాదుకు మించి శ్రమ
కీళ్లపై ఒత్తిడి పెరిగినప్పుడు, కీళ్లమధ్యలో ఉన్న మృదులాస్థి అరిగిపోతుంది. అందువలన కీళ్లలోని రెండు ఎముకల మధ్య రాపిడి మొదలై అరుగుదలకు దారి తీస్తుంది. అధిక బరువు ఉండటం వల్ల బరువును మోసే కీళ్లపై భారం పడి కీళ్లలోని కార్టిలేజ్ అరిగిపోతుంది. దాని ద్వారా ఎముకల మధ్య రాపిడి పెరిగి అరుగుదలకు దారి తీస్తుంది. ఏదైనా ప్రమాదంలో ఎముకలకు బలమైన దెబ్బలు తగిలినప్పుడు లేదా ఎముకలు విరిగినప్పుడు, అవి సరిగ్గా అతకనప్పుడు ఆ ఎముకలు త్వరగా బలహీనపడి అరుగుదల మొదలు కావచ్చు. మనం తీసుకునే ఆహార పదార్థాలలో కాల్షియం, విటమిన్ డి, ఫాస్పరస్, ఇతర ఖనిజాలు తగినంత శరీరానికి లభించకపోయినా ఎముకలలో అరుగుదల వస్తుంది. మోతాదుకు మించిన శారీరక శ్రమ చేసే వారిలో కూడా ఎముకల అరుగుదల త్వరగా వస్తుంది. స్త్రీలలో మెనోపాజ్ దశలో ఈస్ట్రాజన్ హార్మోన్ తగ్గి కాల్షియం మోనోబాలిజంపై ప్రభావం చూపడం వల్ల కాల్షియం తగ్గిపోతుంది. అలాంటప్పుడు కీళ్లలో అరుగుదల వేగం పెరుగుతుంది. కొన్నిసార్లు... హైపోథైరాయిడ్, మధుమేహం, మార్పన్‌సిండ్రోమ్, అక్రొమెగాలి, రుమటాయిడ్, ఆర్థరైటిస్, గౌట్, ఆస్టియోమలెసియా వంటి జబ్బుల వల్ల కూడా ఎముకల్లో అరుగుదల మొదలవుతుంది. ఇవి కాకుండా జన్యుపరంగా వారి తల్లిదండ్రుల నుంచి ఆస్టియో ఆర్థరైటిస్ సంక్రమించే అవకాశం కూడా ఉంది. అలాగే పుట్టుకతో వచ్చే కొన్ని జబ్బుల వలన కూడా ఎముకలలో త్వరగా అరుగుదల రావచ్చు.
రాపిడి శబ్దాలు
ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చిన వారికి కీళ్లు వాచి, బిగుసుకుపోయి బాధిస్తాయి. వ్యాయామం చేసేటప్పుడు ఆ బాధ మరింత పెరుగుతుంది. కీలు కదలికలు తగ్గిపోతాయి. కీళ్లలో రాపిడి శబ్దాలు వినిపిస్తాయి. కీళ్ల భాగాల్లో వాపులు వస్తాయి. ఉదయం లేవగానే కీళ్లు పట్టేసినట్టు ఉంటుంది.
బీఎండీ పరీక్ష
ఎక్స్ రే ద్వారా ఎముకల మధ్య గ్యాప్‌ను, కీళ్ల ఎముకల అరుగుదలనూ తెలుసుకోవచ్చు. అయితే ఎముకలు ఎలా ఉన్నాయో తెలియాలంటే బీఎండీ పరీక్ష చేయించక తప్పదు. వీటితో పాటు సీరమ్ కాల్షియం, పాస్పరస్, మెగ్నిషియం కూడా ఏ స్థాయిలో ఉందో, పారాథైరాయిడ్ హార్మోన్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. అలాగే టీ3, టీ4, టీఎస్4 పరీక్షలు చేయించాలి. విట్, డీ లెవల్స్ తెలుసుకున్న తరువాత రోగి లక్షణాలను బట్టి వ్యాధిని నిర్ధారించవచ్చు.
హార్మోన్ థెరపీ
కీళ్ల అరుగుదలకు దూరంగా ఉండాలంటే... ముందుగా శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. కండరాలకు బలం ఇచ్చేలా వ్యాయామం, ఏరోబిక్స్ చేయాలి. మోతాదుకు మించి చేసే పనులు ఆపేయాలి. కాల్షియం, ఫాస్పరస్ అధికంగా ఉన్న ఆహారంతోపాటు పాలు, గుడ్లు, ఆకు కూరలు, మాంసం ఎక్కువగా తీసుకోవాలి. మెనోపాజ్ దశకు చేరిన స్ర్తీలు హార్మోన్ ఽథెరపీ తీసుకోవాలి. రోజు కనీసం 15 నిమిషాలు ఉదయం పూట ఎండలో నిలబడాలి. నొప్పి ఉన్న చోట వేడి నీటితో కాపడం పెట్టాలి. ఎముకలకు దెబ్బ తగిలినప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
హోమియోలో ఆస్టియో ఆర్థరైటిస్ నివారించడానికి మంచి మందులు ఉన్నాయి. ఈ వైద్య విధానంతో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలు అనుసరించి... కాల్కేరియాప్లారా, రస్టాక్స్, రూటా, కాల్కేరియాఫాస్, సైలీషియా, ఆరంమెట్, హెక్లాలావా, ఫ్లోరిక్ ఆసిడ్ వంటి మందులు వాడితే ఈ వ్యాధి నివారణకు ఉపకరిస్తాయి.
డాక్టర్ మురళీ అంకిరెడ్డి, ఎండీ, హోమియో
స్టార్ హోమియోపతి
సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, హన్మకొండ-వరంగల్, కర్నాటక.
ఫోన్: 90300 81876,
90300 81861

0 comments:
Post a Comment