ఫేసియల్స్ ముఖారవిందానికి పనికొస్తాయి. కాని ఏ స్కిన్‌కు ఎలాంటి ఫేసియల్స్ నప్పుతాయో తెలుసుకోవడం చాలా అవసరం. అప్పుడే ఫలితం కూడా బాగుంటుంది. ఆ విశేషాలు ఇవి...
సాధారణ చర్మం కోసం యాపిల్ మాస్క్
యాపిల్‌ను చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని తరువాత గుజ్జు మాదిరిగా చేసుకోవాలి. దీనికి తేనె కలిపి 10 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఈ మిశ్రమాన్ని నిదానంగా మసాజ్ చేస్తున్నట్టుగా ముఖంపై అప్లై చేయాలి. అరగంటపాటు తరువాత శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. యాపిల్‌లో విటమిన్ ఎ, బి, సి ఉంటాయి. ఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్ లభిస్తుంది. ఇవన్నీ సాధారణ చర్మానికి నిగారింపు వచ్చేలా చేస్తాయి.
మొటిమల చర్మానికి ఆరెంజ్ మాస్క్
ముఖంపై మొటిమలు ఉంటే ఎవ్వరికైనా ఆందోళన ఉంటుంది. మొటిమలు అధికంగా వస్తున్న వారు ఒక ఆరెంజ్, ఒక టీస్పూన్ పుదీనా, కొంచెం లెమన్ జ్యూస్ కలిపి గుజ్జు మాదరిగా చేసుకుని ముఖానికి మాస్క్ మాదిరిగా పెట్టుకోవాలి. అరగంట పాటు అలా వదిలేసి తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఆరెంజ్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, జింక్ మొటిమలను నిరోధించడంలో తోడ్పడతాయి. ఈ సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ మూసుకుపోయిన చర్మరంధ్రాలు తెరిచేలా చేస్తుంది. బ్లాక్‌హెడ్స్‌ను తొలగిస్తుంది.
డల్ స్కిన్ కోసం స్ట్రాబెర్రీ మాస్క్
అరకప్పు స్ట్రాబెర్రీల గుజ్జు, పావు కప్పు కార్న్‌స్టార్చ్‌ను పేస్ట్ మాదిరిగా చేసుకుని ముఖానికి పట్టించాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. అలసిపోయినట్లుగా ఉన్న చర్మానికి, డల్‌స్కిన్‌కు ఇది బాగా పనిచేస్తుంది. స్ట్రాబెర్రీలో సాలిక్లిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది.
మీ స్కిన్ పొడిబారినట్లుగా ఉంటే అప్రికాట్, రామాఫలం తొక్కలు బాగా పనిచేస్తాయి.
ఒకవేళ ఆయిల్ స్కిన్ అయినట్లయితే యాపిల్ తొక్కలు పర్‌ఫెక్ట్.
గ్రేప్, కుకుంబర్ పీల్స్ ఏస్కిన్ టైప్ వారైనా ఉపయోగించవచ్చు.

0 comments:
Post a Comment