Powered by Blogger.

హైపటైటిస్‌-బికి చెక్‌ పెట్టవచ్చు


ఏ వ్యాధినైనా డాక్టర్‌ దగ్గర ధైర్యంగా చెప్పుకుంటారు కానీ, లైంగిక వ్యాధికి గురయితే మాత్రం బయటకు చెప్పుకోవడానికే నానా తంటాలు పడాల్సి వస్తుంది. అసలు లైంగిక వ్యాధులు అంటేనే ఒక భయం, ఎన్నో రకాల సమస్యలు, అవగాహన లోపం, తెలియని ఆతృత. ఏదో ఒక మందుతో దాన్ని తగ్గించుకోవాలనే ఆరాటం. వీటన్నిటి మధ్య నలిగిపోయేవారు ఎందరో! సరైన చికిత్స లేక ఎంతోమంది తమ జీవితాను నాశనం చేసుకుంటున్నారు. అయితే ఇటువంటి సమస్యలకు సత్వర పరిష్కారంతో, నమ్మకమైన చికిత్సతో మంచి ఫలితాలు సాధించవచ్చని, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్‌ మధు వారణాశి.
 
లైంగిక వ్యాధులలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి హెపటైటిస్‌ బి. ఒక సర్వే ప్రకారం, ప్రపంచంలో సుమారు 200 కోట్ల మంది జనాభా హెపటైటిస్‌ బి బారిన పడినట్లుగా తెలుస్తోంది. వైరల్‌ సంబంధిత వ్యాధులలో హెపటైటిస్‌ బి ఒక మహమ్మారిగా మారే సూచనలు న్నాయి. భారతదేశంలో 4 కోట్ల మంది హెపటైటిస్‌ బి తో బాధపడుతున్నారని అంచనా. ప్రతి సంవత్సరం లక్ష మందికి పైగా భారతీయులు హెపటైటిస్‌ బి మూలంగా మరణిస్తున్నారు. రక్తం, లాలాజలం, వీర్యం, యోని ద్రవం లాంటి పదార్థాలలో వైరస్‌ ఉంటుంది. అసురక్షితమైన లైంగిక సంపర్కం వల్ల ఇది సంక్రమిస్తుంది. తల్లుల నుంచి పిల్లలకు, శిశువు నుంచి శిశువుకు సంక్రమిస్తుంది. అవగాహన లోపంతో ఎంతో మంది దీని బారినపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
 
హెపటైటిస్‌ బి అంటే?
మానవ శరీరంలో కాలేయం ముఖ్యమైన భాగం. ఎన్నో కార్యక్రమాలను కాలేయం నిర్వహిస్తుంది. అలాంటి కాలేయం దెబ్బతింటే ఎన్నో బాధలు, ఎన్నో విపత్తులు ఎదురవుతాయి. కొన్ని రకాల వైరస్‌ కారణంగా కాలేయానికి ఇన్ఫెక్షన్‌ వచ్చి హెపటైటిస్‌ వ్యాధి వస్తుంది. వీటిలో ప్రమాదకరమైనవి హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సి. వీటిని హెపటోట్రోఫిక్‌ వైరసస్‌ అని అంటారు. హెపటైటిస్‌ బి మొదట మామూలు లక్షణాలతో వచ్చి, అది దీర్ఘకాలికంగా మారి, కాలేయాన్ని మెల్లమెల్లగా నిర్వీర్యం చేస్తూ ప్రాణాంతకంగా మారుస్తుంది. లివర్‌ కేన్సర్‌, సిరోసిస్‌, వైరల్‌ హెపటైటిస్‌ వ్యాధులు రావడానికి మూలకారణం అవుతుంది. హెపటైటిస్‌ బి వల్ల కాలేయంలోని కణజాలం క్రమక్రమంగా పాడవుతుంది. రోగనిరోధక వ్యవస్థ తగ్గడం వల్ల కాలేయం నిర్వహించే విధులకు ఆటంకం ఏర్పడుతుంది. దీని వల్ల కాలేయంలో వాపు వచ్చి పలురకాల సమస్యలకు తోడ్పడుతుంది.

కారణాలు
స్టెరిలైజ్‌ చేయని సిరంజీలు, లైంగిక సంపర్కం ద్వారా.
హెపటైటిస్‌ బి ఉన్న వ్యక్తి నుండి నేత్రాలు, మూత్రపిండాలు, రక్తం తీసుకోవడం వల్ల.
హెహెటైటిస్‌ బి సోకిన వారి రక్తం, గాయాల ద్వారా, ఏ కారణం చేతనైనా వీరి రక్తం వేరేవాళ్లకు తాకడం ద్వారా.
పచ్చబొట్టు, ఒకే బ్లేడ్‌, ఒకే సిరంజి ఎక్కువమంది వాడినప్పుడు, కలుషితమైన ఆహారం.
బ్యాక్టీరియా, అమీబాల వంటి పరాన్నజీవుల వల్ల హెపటైటిస్‌ బి వ్యాపిస్తుంది. ఎయిడ్స్‌ కన్నా ప్రమాదకరమైన వ్యాధిగా గుర్తించవచ్చు. 
 
లక్షణాలు
సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు బయటికి కనిపించకుండా నిశ్శబ్దంగా ఉంటాయి. హెపటైటిస్‌ బి వైరస్‌ ఎన్నో సంవత్సరాలు శరీరంలో ఉంటుంది. శరీరం వెలుపల సాధారణ ఉష్ణోగ్రత వద్ద వారం రోజులు మాత్రమే సజీవంగా ఉండగలదు. కొంతమందిలో ఈ వైరస్‌ ప్రవేశించిన కొద్ది రోజులకే కామెర్లు వస్తాయి. దీనిని అక్యూట్‌ స్టేజ్‌గా చెప్పవచ్చు. ఈ దశలో దానంతటదే తగ్గుతుంది. కొంతమందిలో ఈ వైరస్‌ తొలగిపోకుండా, శాశ్వతంగా శరీరంలో ఉంటూ బలం పెంచుకుంటూ పోతుంది. దీనిని క్రానిక్‌ స్టేజ్‌ అంటారు. ఇదే అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. హెపటైటిస్‌ బి కారణంగా కాలేయం వ్యాధిగ్రస్తమై భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. కాళ్ల వాపు, పొట్ట ఉబ్బరం, వాంతులు లక్షణాలు కనపడతాయి. 
 
ఎలా నివారించాలి?
విచ్చలవిడి శృంగారానికి దూరంగా ఉండాలి. అపరిచితులతో శృంగార జీవితంలో సురక్షితమైన పద్ధతులు అవలంబించాలి. డిస్పోజబుల్‌ సూదులు, సిరంజీలు వాడాలి. ఒకరు వాడిన షేవింగ్‌ రేజర్లు, బ్లేడ్లను వాడరాదు. రక్తం తీసుకోవలసి వస్తే హెపటైటిస్‌ బి పరీక్ష చేసి రక్తం ఎక్కించుకోవాలి. 
వ్యాధి నిర్ధారణ
హెచ్‌బిఎస్‌ ఎజి అనే రక్తపరీక్ష, లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌, సిబిపి, లివర్‌ బయాప్సి, వైరల్‌ లోడ్‌ ద్వారా రోగ తీవ్రతను గుర్తించవచ్చు. 
హోమియో చికిత్స
సహజసూత్రాలపైన ఆధారపడిన హోమియో వైద్యం వ్యాధిని పూర్తిగా నిర్మూలించగల సత్తా కలిగినది హోమియోపతి రోగనిరోధక శక్తిని పెంచి ఇమ్యునో మాడ్యులేటర్స్‌గా పనిచేస్తుంది. అందువల్ల మూలకారణాన్ని గుర్తించి చికిత్స చేస్తే ఎలాంటి సమస్య అయినా తగ్గుతుంది. హెపటైటిస్‌ బి లాంటి కేసులలో ఆధునిక హోమియో చికిత్సతో రోగిలోని రోగనిరోధక శక్తిని పెంచి దుష్ఫలితాలు లేకుండా వ్యాధిని నివారించవచ్చు. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుని పర్యవేక్షణలో చికిత్స చేయించుకుంటే హెపటైటిస్‌ బి లేదా హెపటైటిస్‌ సి వ్యాధులను నయం చేయవచ్చు.
 
డాక్టర్‌ మధు వారణాశి, ఎం.డి
ప్రముఖ హోమియో వైద్యులు ,
ప్లాట్‌ నెం 188, వివేకానందనగర్‌ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్‌,
ఫోన్‌ : 8897331110, 8886 509 509 
Share on Google Plus

About Kiran

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

0 comments:

Post a Comment

Healthy