వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో ఆహారపానీయాల పాత్ర సగమైతే మిగతా సగం పాత్ర ఆక్సిజన్‌దే. మన శరీరంలోని కోట్లాది కణజాలమంతా ఆక్సిజన్ ఆధారంగానే మనుగడ సాగిస్తుంది. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ లభించినప్పుడు శరీర వ్యవస్థను నిలబెట్టే రసాయనాలు స్థిరత్వాన్ని పొందుతాయి. దీనివల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసి, ఆహార పదార్థాలు జీర్ణమై, అందులోని పోషకాలు శరీరానికి అంది మిగతా వ్యర్థాలు పూర్తి స్థాయిలో బయటికి వెళతాయి. ఈ ప్రక్రియ సజావుగా జరిగినప్పుడే కణజాలమంతా పరిపుష్టమై, వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఆక్సిజన్ నిల్వలు సరిగా ఉంటే శరీరంలోని హానికారకమైన కార్టిసాల్ హార్మోన్లు తగ్గుముఖం పడతాయి. అన్నింటినీ మించి అణువణువునా ఆక్సిజన్ నిండి, ఆల్కలైన్ నిల్వలు పెరిగినప్పుడు శరీరరంలో కేన్సర్ కణాలు పెరిగే అవకాశం ఉండదు. అందువల్ల ప్రాణవాయువును సరిపడా పీల్చే బ్రీతింగ్ ఎక్సర్‌సైజులకు అత్యధిక ప్రాముఖ్యతను ఇవ్వడం చాలా అవసరం.
ఆక్సిజన్‌తో కేన్సర్ కణాలకు చెక్

0 comments:
Post a Comment