Powered by Blogger.

ఎముకల దృఢత్వానికి


ఎముకల దృఢత్వానికి కాల్షియం చాలా అవసరం. అంతేకాదు... కండరాలు, నరాల వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే కాల్షియం అవసరం చాలా ఉంటుంది. డైట్‌లో ఇవి ఉండేలా చూసుకోవడం ద్వారా కాల్షియం తగినంత లభించేలా చూసుకోవచ్చు.
పాలు 1 కప్పు: కాల్షియం అనగానే ముందుగా పాలే గుర్తుకొస్తాయి. సులభంగా జీర్ణమమడమే కాకుండా శరీరం త్వరగా గ్రహిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కప్పు పాలు తీసుకుంటే 280మి.గ్రా కాల్షియం లభిస్తుంది. 
ఆరెంజ్‌ ఒకటి: ఒక ఆరెంజ్‌ తీసుకుంటే 60 మి.గ్రా కాల్షియం లభిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధకశక్తిని పెంచుతుంది. విటమిన్‌ డి కూడా ఉండటం వల్ల కాల్షియంను శరీరం త్వరగా గ్రహిస్తుంది. 
సోయా మిల్క్‌ ఒక కప్పు: ఒక కప్పు సోయామిల్క్‌లో 60 మి.గ్రా కాల్షియం లభిస్తుంది. కాల్షియంతో పాటు విటమిన్‌ డి కూడా లభిస్తుంది. 

బాదం: ఒక కప్పు బాదంలో 457 మి.గ్రాల కాల్షియం ఉంటుంది. కాల్షియం ఎక్కువగా లభించే ఆహారపదార్థాల్లో ఇది టాప్‌లి్‌స్టలో ఉంటుంది బాదం. ప్రొటీన్స్‌ కూడా తగినంత లభిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచే గుణం ఉంటుంది. గుండె జబ్బుల రిస్క్‌ తగ్గిపోతుంది. 
పెరుగు: రోజులో కనీసం ఒకసారి పెరుగు వేసుకున్నా 400మి.గ్రాల కాల్షియం లభిస్తుంది. పాలకు బదులుగా పెరుగు తీసుకున్నా తగినంత కాల్షియం లభిస్తుంది. 
జున్ను: కాల్షియంతో పాటు ప్రొటీన్లు కూడా లభిస్తాయి. ఒక కప్పు జున్ను తీసుకుంటే 951మి.గ్రా కాల్షియం లభిస్తుంది. 
ఆకుకూరలు: ఆకుకూరల్లోనూ కాల్షియం అధికంగా ఉంటుంది. పాలకూర, తోటకూర, బ్రొక్కోలి... వంటి ఆకుకూరల్లో కాల్షియంతో పాటు పొటాషియం, మెగ్నీషియం లభిస్తుంది. ఒక కప్పు ఆకుకూరలో 336మి.గ్రాల కాల్షియం లభిస్తుంది.  
Share on Google Plus

About Kiran

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

0 comments:

Post a Comment

Healthy