గురక ఎదుటి వాళ్లనే కాదు సమస్య ముదిరితే గురకదారుకు కూడా నిద్రాభంగం కలిగిస్తుంది. అసలు గురక ఎందుకొస్తుంది? నాసికా రంధ్రంలోనో లేదా మెడలోని వెనుక భాగంలోనో అదనంగా కొంత కణజాలం పెరిగిందనడానికి అదొక నిదర్శనం. కొందరిలో గొంతుకు సంబంధించిన కణజాలం బిగువు సడ లడం వల్ల కూడా గురక వస్తుంది. మరికొందరిలో నాలుక మడతపడి శ్వాసకు అడ్డుపడటం వల్ల కూడా గురక రావచ్చు. ఏమైనా, గురక ఏ కార ణంగా వస్తోందో ఒక సారి స్పష్టంగా గుర్తిస్తే, ఆ సమస్యను తొలగించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టడం సాధ్యమవుతుంది. వీటితో పాటు, రాత్రివేళ మద్యం సేవించడం, నిద్రా భంగిమను అపసవ్యంగా మార్చివేయడం, గురకకు దారి తీసే కొన్ని మందులను దీర్ఘకాలికంగా వాడటం, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడానికి దారి తీసే వాతావరణంలో ఎక్కువ సమయం ఉండడం వంటివి కూడా గురక సమస్యకు మూలమవుతాయి. ఆ కారణాల్ని గుర్తించి వాటి కి దూరమైతే గురక సమస్య నుంచి విముక్తిం పొందడం సులువవుతుంది. ఒక వేళ అప్పటికీ సమస్య అలాగే ఉండిపోతే అప్పుడిక ఇతర మార్గాల్ని అన్వేషించక తప్పదు.
ఇతర మార్గాలు:
ఎల్‌ఏయు ప్లాస్టీ:
లే జర్- అసిస్టెడ్.. అనే లేజర్ చికిత్సా విధానాన్ని ఈ సమస్యను తొలగించడానికి ఉపయోగిస్తారు. ఇందులో కార్బన్ డయాక్సైడ్ లేజర్ ద్వారా గొంతులోని వెనుక భాగంలో అడ్డుపడుతున్న కణజాలాన్ని తొలగిస్తారు.
పేలేటల్ ఇంప్లాంట్స్
ఈ విఽధానాన్ని పిల్లర్ ప్రొసీజర్ అని కూడా అంటారు. మూడు మ్యాచ్ స్టిక్ సైజులో ఉండే ప్లాస్టిక్ రాడ్స్‌ను గొంతులోని మృఽధు భాగంలో అమరుస్తారు. దీనివల్ల గొంతులో జారిపడి ఉన్న కణజాలం తిరిగి తన పూర్వ స్థానానికి చేరుతుంది. ఫలితంగా గురక ఆగిపోతుంది.
సోమ్నోప్లాస్టీ
ఈ విధానంతో రేడియో తరంగాల్లో ఉష్ణం నింపి, అవి కుదించుకుపోయేలా చే సి, గురకకు కారణమైన వాటిని తొలగిస్తారు. ఈ ప్రక్రియ కొద్ది నిమిషాల్లోనే పూర్తి అవుతుంది. ఇందులో ఎంత మాత్రం రక్తస్రావం కాదు. అయితే పూర్తి ఫలితాలు వచ్చేదాకా పదే పదే చేయాల్సి ఉంటుంది.

0 comments:
Post a Comment