Powered by Blogger.

ఆకర్షణీయమైన రూపం సులభంగా సొంతం


టీనేజ్‌లోకి వచ్చిన తరువాత  యువతీయువకులు మాట్లాడుకునే విషయాలలో రంగు, రూపం గురించిన అంశాలే ఎక్కువగా ఉంటాయి. ముఖం అందంగా లేదని, ఇంకొంచెం కోలగా ఉంటే బాగుండేదని, రంగు తక్కువగా ఉన్నానని, చర్మం మృదువుగా కాంతివంతంగా లేదని, జుట్టు ఒత్తుగా లేదని బాధపడుతుంటారు. అయితే ఈ సమస్యలన్నీ ప్లాస్టిక్‌ సర్జరీతో, కాస్మెటిక్‌ చికిత్సలతో దూరమవుతాయని, 6 నుంచి 12 నెలల్లో నచ్చిన రూపురేఖలు, ఒత్తైన జుట్టు సొంతం చేసుకోవచ్చని అంటున్నారు ప్లాస్టిక్‌ అండ్‌ కాస్మెటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ వెంకట్‌తోట.
 
ముఖకవళికలు మార్చుకోవడానికి ముక్కు సర్జరీ(రైనోప్లాస్టి), దవడసర్జరీలు, పెదవుల సైజు తగ్గించడం, చెంపల మీద దవడకు ఇంప్లాంట్స్‌ పెట్టడం, గడ్డాన్ని ముందుకు లేక వెనక్కు జరపడం వంటి సర్జరీలు చేయించుకోవాలి. అనుభవజ్ఞులైన ప్లాస్టిక్‌ సర్జన్‌ మీ ముఖాన్ని వివిధ కోణాల్లో పరిశీలించి మీకు ఏమి మార్పులు అవసరమో చెబుతారు. 
మృదువైన, కాంతివంతమైన చర్మం : పుట్టుకతోనే తెల్లని కాంతివంతమైన మృదువైన చర్మాన్ని కలిగి ఉండటం కొందరికి సహజంగానే వస్తుంది. కానీ చాలా మందికి ఎండ ఎక్కువగా సోకడంతో, మొటిమలతో వచ్చే గుంటల వల్ల ముఖం మీది చర్మం మొద్దుబారి కళా విహీనంగా తయారవుతుంది. ఒక్కోసారి వారు సహజంగా ఉన్న చర్మం రంగుని కూడా కోల్పోతారు. సహజంగా మంచి రంగు కలిగి ఎండ ఎక్కువగా సోకడం వల్ల కానీ, ఏదేని మందుల ప్రభావంతో కానీ, అనారోగ్య కారణాల వల్ల కానీ చర్మం రంగును కోల్పోయిన వారు మెడికల్‌ కాస్మెటిక్‌ చికిత్సలతో మంచి రంగును, మృదువైన చర్మాన్ని తిరిగి పొందవచ్చు. గ్లుటథయోన్‌ వంటి యాంటీఆక్సీడెంట్లు కలిగిన మాత్రలు చర్మపు రంగుని, మృదుత్వాన్ని తిరిగి పొందడానికి ఉపయోగపడతాయి.
సహజంగానే నల్లని రంగు ఉన్న వారు కూడా ఈ చికిత్సలతో 20 నుంచి 30 శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు. 
మెకానికల్‌ డెర్మాబ్రాసన్‌/డైమండ్‌ డెర్మాబ్రాసన్‌ : తక్కువ కాలంలో మంచి ఫలితాలను పొందాలనుకునే వారికి ఈ ప్రక్రియ మంచి ఫలితాలను ఇస్తుంది. నిపుణులైన ప్లాస్టిక్‌ సర్జన్లు ఈ ఆపరేషన్‌ చేస్తారు. పూర్తి మత్తు, కానీ ముఖం వరకు మత్తు ఇచ్చి కానీ ఈ చికిత్స చేస్తారు. ముఖం మీద చర్మాన్ని సున్నితమైన పరికరాలతో ఒక పలుచని పొరను తీసివేయడం ద్వారా మృదువుగా చేస్తారు. ఒక వారం రోజులు ముఖానికి బ్యాండేజ్‌ వేసుకోవాల్సి ఉంటుంది. రెండు నెలల వరకు ఎండ తగలకుండా చూసుకోవాలి. ఈ సర్జరీ ద్వారా చర్మపు పూర్వపు రంగును ఒక్క సిట్టింగ్‌లోనే పొందవచ్చు. మొటిమల ద్వారా ఏర్పడిన గుంతలకు, మచ్చలకు ఈ సర్జరీ మంచి పరిష్కారాన్ని చూపుతుంది. మంగు మచ్చలకు ఈ సర్జరీ మంచి పరిష్కారాన్ని చూపుతుంది. ఒక్కసిట్టింగ్‌లోనే మచ్చలన్నీ కనిపించకుండా పోతాయి. 
కెమికల్‌పీల్స్‌ : వాస్తవానికి కెమికల్‌ పీల్స్‌లో వాడే కెమికల్స్‌ మొక్కల నుంచి, పాల నుంచి, చెరకు రసం నుంచి తీస్తారు. ఇవి ఆర్గానిక్‌ యాసిడ్స్‌. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఇవి చాలా సురక్షితమైనవి. మూడు నుంచి ఆరు నెలల సమయంలో ఈ చికిత్స ద్వారా మంచి చర్మపు రంగును పొందవచ్చు. చర్మాన్ని కాంతివంతంగా మృదువుగా మార్చుకోవచ్చు. 
చర్మం శరీరంలోని అతి పెద్ద ఆర్గాన్‌. శరీరంలోని అన్ని అవయవాల కంటే ఎక్కువగా వాతావరణంలోని మార్పులకు, దుమ్ము, ధూళికి, చల్లని, వేడి గాలులకు లోనవుతుంది. చర్మంపై పొరలు వాతావరణంలోని మార్పులకు స్పందిస్తాయి. కనుక మంచి రంగు ఉన్న వారు కూడా వేడి వాతావరణానికి సూర్యరశ్మికి లోనయినపుడు నల్లగా మారతారు. కనుక చర్మానికి తీసుకునే చికిత్సలు జాగ్రత్తలు రెగ్యులర్‌గా తీసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు కెమికల్‌పీల్స్‌ ప్రతి రెండు నెలలకొకసారి తీసుకోవాలి. ముఖానికి విటమిన్‌ సీరమ్స్‌ వాడుతూ ఉండాలి. కోజిక్‌ యాసిడ్‌, అర్బటిన్‌ వంటి మెలనిన్‌ పిగ్మెంట్‌ని తగ్గించే క్రీములు రెగ్యులర్‌గా వాడాలి. బయటకు వెళ్లే ముందు ఎస్‌పీఎఫ్‌ 50 కన్నా ఎక్కువగా ఉండే సన్‌స్ర్కీన్‌లు వాడాలి. రెగ్యులర్‌గా యాంటీ ఆక్సిడెంట్‌లు ఉండే ఆకుకూరలు, పళ్లు తినాలి. 
చర్మానికి పోలిష్‌ : అతి కొద్ది సమయంలో చర్మం మృదువుగా మెరుస్తూ రావడానికి ఈ చికిత్స ఎంతో ఉపయోగపడుతుంది. మొదట వారానికి ఒకసారి నాలుగు వారాలు తీసుకోవాలి. తరువాత నెలకోసారి చేయించుకుంటే ఫలితాలు ఎప్పటికీ ఉంటాయి.
జుట్టు రాలిపోవడం : జుట్టు రాలిపోవడం, బట్టతల రావడం వంటి సమస్యలకు కాస్మెటిక్‌ చికిత్సలు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తాయి.
చక్కని శరీరాకృతి : లైపోసక్షన్‌ లేక లైపోస్కల్‌ప్చర్‌ సర్జరీ ద్వారా సన్నని నడుమును, తొడభాగాలను, తీరైన పొట్టను పొందవచ్చు. చర్మం కింద అధికంగా చేరిన కొవ్వును తీసివేసి శిల్పంలాంటి ఆకృతిని తీసుకురావచ్చు.
బ్రెస్ట్‌ ఇంప్లాంట్స్‌: అగ్‌మెంటేషన్‌ మమ్మోప్లాస్టి ద్వారా ఛాతీ పెరగని స్త్రీలు అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఒక్కసిట్టింగ్‌లోనే కావలసిన సైజును పొందవచ్చు. 
ఫురుషుల్లో ఛాతీ పెరిగితే...: పురుషుల్లో అతిగా పెరిగిన ఛాతీని తగ్గించడానికి ప్లాస్టిక్‌ సర్జరీ బాగా ఉపయోగపడుతుంది. కొందరు పురుషుల్లో స్త్రీలలో మాదిరిగా రొమ్ములు పెరుగుతాయి. వారు ఈ సర్జరీలతో పరిష్కారం పొందవచ్చు.
ముఖంలో చేయించుకోదగిన మార్పులు
ముక్కు సర్జరీ : ముక్కు సంబంధించిన మార్పులు 17 లేక 18 ఏళ్లు పైబడిన తరువాత ఎప్పుడైనా చేయించుకోవచ్చు. 
చెవి: కొంతమందిలో పుట్టుకతో చెవిలేకపోవడం, చెవి సరైన ఆకారం లేకపోవడం జరుగుతుంది. చెవికి సంబంధించిన ఏ సర్జరీయైనా 8 ఏళ్లు దాటినా తరువాత చేయించుకోవచ్చు.
పెదవులు : పెదవులు లావుగా ఉన్నట్లయితే ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా నాజుగ్గా చేయించుకోవచ్చు. నల్లగా ఉంటే కాంతివంతంగా మార్చుకోవచ్చు. 
దవడ, గడ్డం : దవడ, గడ్డాన్ని కావలసిన విధంగా ముందుకు, వెనక్కి జరుపుకోవచ్చు. ఈ సర్జరీని జీనోప్లాస్టి అంటారు. ఈ సర్జరీలతో ముఖకవళికలు చాలా వరకు మారుతాయి. ఆకర్షణీయమైన రూపం సొంతమవుతుంది.
 
డాక్టర్‌ వెంకట్‌ తోట
రెవేరా కాస్మెటిక్‌ అండ్‌ లేజర్‌ సర్జరీ సెంటర్‌, ప్రైమ్‌ ప్లాజా, హిమాయత్‌నగర్‌, హైదరాబాద్‌,  
ఫోన్‌ : 040 23461999 ,  9866224871
Share on Google Plus

About Kiran

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

0 comments:

Post a Comment

Healthy